తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sandeep Kishan: ఆ రెండు సినిమాలు వదులుకొని తప్పు చేశాను!

విభిన్న కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. ‘స్నేహగీతం’ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన ఈ యువ హీరో ‘ప్రస్థానం’ మూవీలో నెగిటివ్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. కానీ ఆ తర్వాత అతని కెరీర్ కొంచెం స్లో అయ్యింది. మళ్లీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో హిట్ కొట్టినా.. కెరీర్‌ను నిలబెట్టే బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఇంతవరకు సందీప్ ఖాతాలో పడలేదు. గతేడాది రిలీజైన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా సైతం ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘మజాకా’ అనే సినిమాలో నటిస్తున్నారు.

కెరీర్ వేరే లెవల్‌కి వెళ్లేది!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఆసక్తికర విషయం పంచుకున్నారు. తాను చేయాల్సిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాల గురించి సందీప్ వెల్లడించారు. ‘దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాల్లో మొదట హీరోగా నన్నే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ మిస్ అయింది. ఆ సినిమాలు వేరే హీరోల దగ్గరికి వెళ్లి బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒకవేళ ఆ సినిమాలు నా ఖాతాలో ఉండి ఉంటే నా కెరీర్ ఇంకో లెవెల్‌కి వెళ్లేది.’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button