తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్
Trending

Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం!’ వసూళ్ల సునామీ.. బాహుబలి-2 రికార్డు బ్రేక్!

విక్టరీ వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం!’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.260 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. త్వరలోనే రూ.300 కోట్లు వసూళ్లు చేసే అవకాశం ఉందని టీమ్‌ పేర్కొంది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. ఈ మూవీకి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు.

13రోజులైనా తగ్గని హవా..!

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు బాహుబలి 2 వసూళ్ల రికార్డును సంక్రాంతికి వస్తున్నాం మూవీ అధిగమించింది. విడుదలైన 13వ రోజు బాహుబలి 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.68 కోట్లు వసూళ్లు చేస్తే.. ఈ సినిమా అదే రోజునాటికి రూ.7 కోట్లు రాబట్టింది. కాగా.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button