తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sankrantiki Vastunamm: అనిల్ రావిపూడి రికార్డు.. 72 రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ షూట్‌ పూర్తి!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్లతో దూసుకుపోతోంది. ఎవరూ చేయని వినూత్న రీతిలో ఈ మూవీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఇక, మూవీలోని ‘గోదారి గట్టుమీద..’ సాంగ్ యూట్యూబ్‌లో చాలా రోజుల నుంచి ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీ మేకింగ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

స్క్రిప్ట్‌ సమయంలోనే ఎడిటింగ్‌!

‘నా గత సినిమాలకు భిన్నంగా ఈ మూవీని తెరకెక్కించాను. స్క్రిప్ట్‌ సమయంలోనే ఎడిటింగ్‌ చేసేశాం. అందుకే ఈ చిత్రం 72 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది. ‘F2’కు 74 రోజులు పట్టగా, రెండు రోజులు ముందుగానే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పూర్తి చేశాం. మొత్తం సినిమా దాదాపు 2 గంటలా 26 నిమిషాలు వస్తే, ఎడిట్‌ చేసి, సెన్సార్‌కు 2 గంటలా 22 నిమిషాల నిడివితో పంపాం. అంటే ఐదారు నిమిషాలకు మించి ఎడిట్‌ చేయలేదు. ఎప్పుడైతే తక్కువ వర్కింగ్‌ డేస్‌లో తీస్తామో అప్పుడు ప్రాజెక్ట్‌ సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉంటుంది. ఈ మూవీకి ఎంత బడ్జెట్‌ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button