
Sankrantiki Vastunnam: వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం!’. సంక్రాంతి కానుకగా నిన్న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వెంకీ మామా, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరిల మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. వసూళ్లపరంగానూ ఈ చిత్రం దూసుకుపోతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు!
‘పండగకి వచ్చారు.. పండగని తెచ్చారు’ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. మరోవైపు, ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు (రూ. 45 కోట్లు) సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో వెంకీ మామ అభిమానులతో పాటు చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. కాగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.