Sathya Dev: తెలుగు ప్రేక్షకులకు హీరో ‘సత్యదేవ్’ రిక్వెస్ట్! దయచేసి.. అంటూ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’. కన్నడ నటుడు, పుష్పలో జాలిరెడ్డి పాత్రతో ఫేమస్ అయిన డాలీ ధనుంజయ్ కీలక పాత్ర పోషించారు. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 6.86 కోట్ల గ్రాస్ సాధించింది. రెగ్యులర్ డేస్ లోను స్టడీ కెలెక్షన్స్ రాబడుతూ సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతోంది. తన సినిమాకు ఇంత గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు హీరో సత్యదేవ్ ఓ చిన్న రిక్వెస్ట్ చేశారు.
Also Read: దటీజ్.. ఐకాన్ స్టార్! ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్!
‘ఇది మీరు ఇచ్చిన విజయం. మీరు బాగుంది అన్నారు, అంతకన్నా ఏం కావాలి. ఈ క్షణం – ఒక్క థియేట్రికల్ హిట్ కోసం!! 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. మీకు నచ్చే సినిమా చేయడానికి, మీతో హిట్ కొట్టావ్ అనిపించుకోడానికి. నేను హిట్ కొడితే, మీరు కొట్టినట్టే ఫీల్ అవుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాని మీరు థియేటర్లలో మిస్ అయ్యి, తర్వాత ఓటీటీ & యూట్యూబ్ లో చూసి చాలా బాగుంది అని ప్రేమ & ప్రశంసలను కురిపించారు. కానీ ఈసారి జీబ్రాకి అలా జరగకూడదని కోరుకుంటున్నాను. దయచేసి ‘జీబ్రా’ని థియేటర్లలో చూడండి. కచ్చితంగా నచ్చుతుంది. మిస్ అవ్వద్దు’ అంటూ ఓ పోస్టర్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.