
Satyam Sundaram: ఓటీటీలోకి వచ్చేసిన ‘సత్యం సుందరం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కార్తి, అరవింద్ స్వామి నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. ప్రేమ్ కుమార్ దర్శకుడు. శ్రీదివ్య కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ కోసం ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇది తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇవాళ్టి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
రూ. 52 కోట్ల వసూళ్లు!
ఇక ఇందులో అరవింద్ స్వామి, కార్తి.. బావ, బావమరిదిగా నటించారు. వీళ్లద్దరి మధ్య వచ్చే కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. తమిళ్‌లో ‘మీయజగన్’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఉంటుందనే ఉద్దేశంతో ‘సత్యం సుందరం’ అనే టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో ఒక్క రోజు ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జ్యోతిక, సూర్య కలిసి ఈ సినిమాను నిర్మించగా గోవింద్ వసంత్ సంగీతాన్ని అందించారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.52 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.