తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sharwanand: బాలకృష్ణ హిట్ మూవీ టైటిల్‌తో శర్వానంద్ కొత్త సినిమా!

టాలీవుడ్ యంగ్ హీర్ శర్వానంద్ మరో కొత్త సినిమాను ప్రకటించారు. సామజవరగమన ఫేం రామ్‌ అబ్బరాజు – శర్వానంద్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి బాలకృష్ణ ఆల్‌ టైమ్‌ సూపర్ హిట్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సంయుక్తా మీనన్‌, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఆకట్టుకుంటున్న పోస్టర్!

ఇద్దరు భామలు అరుస్తుంటే.. శర్వానంద్‌ మధ్యలో నలిగిపోతూ చెవులు మూసుకోవడం ఫస్ట్ లుక్‌లో చూడొచ్చు. ‘ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా’ అంటూ షేర్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button