తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Singer Kalpana: అల్లు అర్జున్‌ని ప్లాన్ చేసి ఇరికించారు.. టాలీవుడ్ సింగర్ సంచలన కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయనను అరెస్ట్ చేయడాన్ని సినీ రంగానికి చెందిన పలువురు ఖండించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ కల్పన అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన కామెంట్స్ చేశారు. ‘అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పొందిన యాక్టర్. బెడ్ రూంలోకి వెళ్లి అరెస్ట్ చేస్తారా..? బన్నీకి చెడ్డ పేరు తెచ్చేలా కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారు. ఉద్దేశపూర్వకంగా ఘటనకు పాల్పడనప్పుడు ఆయనపై ఈ సెక్షన్లు ఏంటీ..? అక్కడ జరిగిన ఘటనలో ఓ మహిళ చనిపోయింది. ఎవరైనా వెళ్లి కొట్టారా..? లేదా ఏదైనా ఆయుధం వాడారా..? అసలు ఈ కఠిన సెక్షన్లు బన్నీపై ఏంటి..? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం కల్పన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాత్రంతా జైల్లోనే!

కాగా.. సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లేలోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగ్గా లేదని చంచల్ గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉన్నారు. అయితే నిన్న ఉదయం బన్నీ జైలు నుంచి విడుదల అయ్యారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button