
SSMB 29: మహేశ్ బాబు కోసం షూటింగ్ ప్రాసెస్‌నే రివర్స్ చేసిన రాజమౌళి!
పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 ప్రాజెక్ట్కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. సహజంగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే నాలుగు లేదా ఐదు సంవత్సరాల అయినా పడుతుందనే విషయం తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు జక్కన్న ఇలాగే టైం తీసుకున్నారు. అయితే మహేశ్ బాబు సినిమా కోసం షూటింగ్ ప్రాసెస్‌ని రాజమౌళి రివర్స్ చేశారట. ఈసారి ముందు విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసి.. తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారట. ఇప్పటికే 40 శాతం వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తయిందట. దీన్ని బట్టి ఈ సినిమా రాజమౌళి గత చిత్రాల్లా కాకుండా.. త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది.
స్టైలిష్ లుక్‌లో మహేశ్!
రాజమౌళితో సినిమా అంటే మహేశ్ బాబు ఫ్యాన్స్ మొదట్లో తెగ భయపడిపోయారట. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీకి కనీసం నాలుగేళ్లయినా టైం పడుతుందని, అప్పటి దాకా తమ హీరో స్క్రీన్‌పై కనబడరని ఆందోళన చెందారట. కానీ ఈ విషయం తెలుసుకున్నాక మాత్రం ఊపిరి పీల్చుకున్నారట. కాగా.. మూవీ కోసం మహేశ్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యారు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో ఇటీవల పలు సందర్భాల్లో ఆయన కనిపించిన తీరు ఫ్యాన్స్‌ని ఎంతో ఆకట్టుకుంది.