తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

SSMB29: మహేశ్-రాజమౌళి మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్?

సూపర్ స్టార్ మహేశ్ బాబు – పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘SSMB 29’. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ నటిస్తుందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో హీరోతో పాటు హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని, ప్రియాంక అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని రాజమౌళి భావిస్తున్నారట. ప్రియాంక కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఈ పాత్ర కోసం ఇప్పటికే ఆమె ప్రిపరేషన్‌ కూడా మొదలుపెట్టారట. ఈ మేరకు త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందని టాక్.

విదేశీ భాషల్లోనూ..!

కాగా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి.. SSMB 29 మూవీని భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలోనూ స్పష్టంచేశారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button