తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

SSMB29: జక్కన్న మూవీలో.. రాముడి పాత్రలో మహేశ్ బాబు?

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజీ కాంబోలో వస్తున్న ‘SSMB29’పై భారీ అంచనాలు ఉన్నాయి. మోస్ట్ అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే జక్కన్న కెన్యా, ఆఫ్రికా దేశాల్లో లొకేషన్లు కూడా చూసొచ్చారు. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఏ చిన్న అప్డేట్ వచ్చినా చాలు, సోషల్ మీడియాలో వెంటనే తెగ వైరలైపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వైరల్‌గా మారింది.

థియేటర్లలో రచ్చ రచ్చే!

ఈ సినిమాకు రామాయణంతో కొంతమేర పోలిక ఉండనుందని.. ఇందులో మహేశ్ బాబు రాముడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాముడిగా మహేశ్‌ను చూపెట్టే నేపథ్యం వారణాసిలో ఉండనుందని.. ఇదే సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో అల్లూరి సీతారామరాజుగా కొంతసేపు రామ్ చరణ్‌ని చూపెట్టిన రాజమౌళి.. ఆ పాత్రకు ఎలాంటి హైప్ తీసుకొచ్చారో తెలిసిందే. ఇక, ఇప్పుడు ఏకంగా రాముడిగా మహేశ్ బాబును చూపిస్తే థియేటర్లలో ఎలాంటి రచ్చ ఉంటుందో ఊహించుకోవచ్చు!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button