తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

SSMB29: రాజ‌మౌళి-మ‌హేశ్‌బాబు సినిమా లాంచ్‌కి డేట్ ఫిక్స్!?

సూప‌ర్ స్టార్‌ మహేశ్‌బాబు, పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ SSMB29. మ‌హేశ్‌, రాజ‌మౌళి కెరీర్‌లోనే అత్య‌ధిక భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విషయం తెలిపింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కోసం జక్కన్న కొంత‌కాలంగా లొకేష‌న్స్ వేట‌లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆఫ్రికా అడ‌వులను జల్లెడ పట్టారు. ఒడిశాలోని కొరాపుట్‌లోనూ పర్యటించారు. అంతేకాదు, అరకు సమీపంలోని బొర్రా గుహల్ని సైతం ఇటీవల రాజమౌళి సందర్శించారు. ఇక, ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టును.. రేపు హైదరాబాద్‌లో ఉదయం 10 గంటలకు పూజ కార్యక్రమాలతో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్!

ఈ నెల చివ‌రి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ త‌రువాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో ర‌చ‌యిత విజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ భార‌తీయ సినీ చరిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ చూడ‌ని ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో ఆవిష్క‌రించ‌నున్నార‌ని చెప్పారు. అమెజాన్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే ప‌లువురు విదేశీ న‌టులు క‌నిపించ‌నున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు, ఈ సినిమా కోసం మహేశ్ బాబు కూడా ఫుల్‌గా మేకోవర్ అయిపోయారు. గుబురు గడ్డం, పొడవాడి జుట్టుతో చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button