SSMB29: సింహాన్ని లాక్ చేశానన్న రాజమౌళి.. మహేశ్ బాబు అదిరిపోయే రిప్లై..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు – పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ SSMB29. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా..? అని ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్.. అటు జక్కన్న ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి రాజమౌళి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ కోసం టీమ్ అంతా విదేశాలకు వెళ్తున్నట్లు హింట్ ఇచ్చేశారు. సింహాన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా జక్కన్న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి ‘క్యాప్చర్’ అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక, ఈ వీడియోకు మహేశ్ బాబు స్పందిస్తూ ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..’ అంటూ రిప్లై ఇవ్వడం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
భారీ అంచనాలు..
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాను రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ అడవుల్లో నాన్ స్టాప్ అడ్వెంచర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ నటులు సైతం నటించనున్నట్లు టాక్. ఇక, ఈ సినిమాలో మహేశ్ ఎప్పుడూ కనిపించిన విధంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.