
Sudeep: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కన్నడ స్టార్ హీరో..?
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగ’ సినిమాతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. మూవీలో విలక్షణమైన తన విలనిజంతో తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేశారు. అయితే తన సినిమా జర్నీపై సుదీప్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 28 ఏళ్లుగా కన్నడ ఇండస్ట్రీలో తన స్టార్ డమ్ కొనసాగిస్తున్న సుదీప్ కేవలం కన్నడలోనే కాదు మిగతా దక్షిణాది సినిమాలలో కూడా నటిస్తూ వచ్చారు.
సపోర్టింగ్ రోల్స్ చేయలేను!
అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుదీప్.. తన సినిమా జర్నీకి రిటైర్మెంట్ ఇస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ‘ఎంత స్టార్ అయినా కూడా ఏదో ఒక టైంలో బోర్ కొట్టేస్తాడు. ప్రతిదానికీ ఓ టైం అనేది ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక హీరోగా తానెప్పుడు ఎవరినీ సెట్‌లో వెయిట్ చేయించలేదన్నారు. ఐతే తాను సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరొకరి కోసం వెయిట్ చేస్తూ కూర్చోలేనని తెలిపారు. బ్రదర్, అంకుల్ పాత్రలు పోషించడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదు’ అని అన్నారు.