తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tandel: అక్కినేని అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా.. ‘తండేల్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ ఇవాళ చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటీలతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీవాసులు పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘తండేల్’.. అక్కినేని అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా అవుతుందని నిర్మాతలు ధీమా వ్యక్తంచేశారు.

మత్స్యకారుల జీవితాలే ఇతివృత్తం!

నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జ‌రిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాల‌రి పొర‌పాటుగా పాకిస్థాన్ స‌ముద్ర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. దీంతో పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button