TG High Court: నాగచైతన్య-శోభితా విడాకుల జోస్యంపై.. వేణుస్వామికి దిమ్మతిరిగే షాక్!
టాలీవుడ్ హీరోహీరోయిన్లు నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్ల ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ తర్వాత జ్యోతిష్కుడు వేణు స్వామి అలియాస్ వేణు పరాంకుశం సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత – నాగచైతన్య లాగే వీరిద్దరూ భవిష్యత్తులో విడాకులు తీసుకుంటారంటూ వేణు స్వామి జోస్యం చెప్పారు. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి ఆయనపై తీవ్ర విమ్శలు వ్యక్తం అయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ తమ ముందు హాజరు కావాలని వేణు స్వామిని ఆదేశించింది. నోటీసులు కూడా పంపించింది. అయితే మహిళా కమిషన్‌కు ఆ అధికారం లేదంటూ హైకోర్టుకు వెళ్లి వేణుస్వామి స్టే తెచ్చుకున్నారు.
వారంలోగా చర్యలు!
ఇక, ఈ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ నిర్వహించిన హైకోర్టు.. ఆ స్టేను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వేణుస్వామిపై చర్యలు తీసుకునేందుకు కమిషన్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయని తీర్పు ఇచ్చింది. అలాగే వారం రోజుల్లోనే వేణుస్వామిపై చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్‌కు స్పష్టం చేసింది. దీంతో మహిళా కమిషన్ ఏం చేయబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.