తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Thaman: నెగిటివ్ ట్రోల్స్‌పై.. తమన్ తీవ్ర భావోద్వేగం!

‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్‌లో సినిమాల నెగిటివ్ ట్రోల్స్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచం మొత్తం తెలుగు సినిమాను గర్వంగా చూస్తుంటే, నెగిటివ్ ట్రోల్స్‌తో మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎలా? ఈ తీరు చూస్తుంటే ఎలా బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కావట్లేదు అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఇది దారుణమైన విషయం!

‘నెగెటివ్‌ ట్రోల్స్‌, నెగెటివ్‌ ట్యాగ్స్‌ సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒక నిర్మాత ఎంతో కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని, ఫైనాన్స్‌ తెచ్చుకొని ఒక సినిమాలో పెడుతుంటాడు. మీరు క్రియేట్‌ చేసే నెగెటివ్‌ ట్రెండ్స్‌ వల్ల ఒక నిర్మాత ఎంత కుమిలిపోతున్నాడో మీకు తెలియదు. ఇది ఎంతో దారుణమైన విషయం. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. హీరోలు, సంగీత దర్శకులు, టెక్నీషియన్స్‌తోపాటు ఫ్యాన్స్‌పైన కూడా ఆ బాధ్యత ఉంది. ప్రపంచం మొత్తం తెలుగు సినిమాను గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ప్రకాశిస్తోంది. అన్ని ఇండస్ట్రీల వారు తెలుగులో సినిమా చేయాలని చూస్తున్నారు.’ అని అన్నారు.

మెగాస్టార్ స్పందన

తమన్ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘డియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే.. Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది.’ అని ట్వీట్ చేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button