Allu Arjun: దటీజ్.. ఐకాన్ స్టార్! ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ ‘పుష్ప – 2: ది రూల్’. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధమైపోయింది. మూవీ యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లను సైతం ప్రారంభించేసింది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను సృష్టించింది. ఈ మూవీ కోసం ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు అటు పాన్ ఇండియా లెవల్లో అందరూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హీట్ పుట్టిస్తోంది.
ఫోర్బ్స్.. మొదటి స్థానంలో
‘పుష్ప-2’ సినిమాకు గానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా నిలిచారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా 2024లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న టాప్-10 నటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ రూ. 300 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ‘పుష్ప-2’ కోసం ఐకాన్ స్టార్ రూ. 300 కోట్లు తీసుకున్నట్లు తన కథనంలో పేర్కొంది. ఇక, తమిళ స్టార్ దళపతి విజయ్ ఇటీవల నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’, ‘లియో’ చిత్రాలతో పాటు, రాబోయే #విజయ్ 69 మూవీ కోసం రూ.275 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. మూడో స్థానంలో బాలీవుడ్ నటుడు షారుక్ నిలిచారు. ‘డంకీ’ మూవీ కోసం ఆయన రూ.150 – 250 కోట్ల పారితోషికం అందుకున్నారట. అలాగే రజనీకాంత్ రూ. 150 – రూ. 270 కోట్లు, ఆమిర్‌ఖాన్ రూ. 100 – రూ.275 కోట్లు), ప్రభాస్ రూ. 100 – రూ. 200 కోట్లు, అజిత్ రూ. 105 – రూ.165 కోట్లు, సల్మాన్ రూ. 100 – రూ.150 కోట్లు, కమల్ హాసన్ రూ. 100 – రూ.150 కోట్లు) అక్షయ్ కుమార్ రూ. 60 – రూ.145 కోట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది.