The Rajasaab: నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్.. ‘రాజాసాబ్’ విడుదల వాయిదా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ‘రాజాసాబ్’ అనుకున్న సమయానికి రావడం లేదన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తికానందునే ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ఉన్నట్టుండి ప్రకటించడంతో దీనిపై క్లారిటీ వచ్చేసింది. ‘రాజాసాబ్’ విడుదల వాయిదా పడుతుందని ‘జాక్’ మూవీ టీంకు క్లారిటీ ఉందని, అందుకే వారు అదే రోజున తమ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినట్లు చెబుతున్నారు.
గాయమే కారణమా?
‘రాజాసాబ్’ వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నారని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తారని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. కాగా.. ఈ ‘ది రాజాసాబ్’ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.