తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: ఈ ఏడాది బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సినిమాలేవో తెలుసా?

2024..ఏడాది టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఏడాది అనేక సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసి తెలుగు సినిమా సత్తా ఏపాటిదో చూపించాయి. హనుమాన్ నుంచి పుష్ప-2 దాకా, కల్కి నుంచి దేవర దాకా బాక్సాఫీస్ వద్ద రప్పా రప్పా సరికొత్త రికార్డులు సృష్టించాయి. తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవల్లో శాసించేలా చేశాయి.

సత్తా చాటిన టాలీవుడ్ సినిమాలు

హనుమాన్: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా ‘హనుమాన్’. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి ఏకంగా సంక్రాంతి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ స‌జ్జా హీరో నటించిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.300 కోట్ల వ‌సూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఇద్దరికీ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.

టిల్లు స్క్వేర్: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. మార్చిలో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.135 కోట్ల వరకూ రాబట్టి సిద్ధు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలచింది.

కల్కి 2898 AD: ఇక, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘కల్కి’ సృష్టించిన బీభత్సం ఇంతా కాదు. నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబోలో మ‌హాభార‌తం & ఫ్యూచ‌ర్‌ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూన్ నెలలో రిలీజన ఈ సినిమా దాదాపు రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబ‌ట్టి 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

సరిపోదా శనివారం: ఈ ఏడాది నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. హాయ్ నాన్న సూపర్ హిట్ తర్వాత.. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ ఆగస్టు చివర్లో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి భారీ హిట్ అందుకుంది.

దేవర: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ సెప్టెంబర్ చివర్లో విడుదలైంది. సినిమాలో సాంగ్స్, ఎన్టీఆర్ యాక్షన్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.550 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది.

లక్కీ భాస్కర్: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ – తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో దీపావళి కానుకగా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేయడమే కాకుండా పలు థియేటర్స్‌లో 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది.

పుష్ప-2: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప 2’ ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో వేగంగా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. సుకుమార్ టేకింగ్, బన్నీ ఫెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కి పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, ఇంకా పడుతున్నారు. బాలీవుడ్ లో ఏకంగా రూ. 700 కోట్లు కొల్లగొట్టి గత రికార్డులన్నీ తెరమరుగు చేసింది. ఈ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రూ. 1800 కోట్ల దిశగా సాగుతోంది.

డబ్బింగ్ చిత్రాల హవా: అంతేకాదు, ఈ ఏడాది పలు డబ్బింగ్ సినిమాలు సైతం తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టాయి. : వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన ‘ది గోట్’, మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తమిళ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ దీపావళికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం మొత్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్‌లో శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ-2’ సినిమా సైతం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button