తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Regina: పెళ్లి చేసుకుబోతున్న స్టార్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

రెజీనా కసాండ్రా.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఎస్ఎమ్ఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. రెజీనాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆతరువాత కూడా మంచి అవకాశాలే దక్కించుకుంది ఈ బ్యూటీ. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో చేసిన పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో మంచి హిట్ అందుకుంది.

Also read: Varalaxmi Sharathkumar: పెళ్లి పీటలెక్కబోతున్న నటి.. సీక్రెట్ గా నిశ్చితార్థం

అయితే ఈ సినిమాలతో వచ్చిన విజయాన్ని కూడా నిలుపుకోలేకపోయింది రెజీనా. అయితే కొంతకాలంగా పెద్దగా సినిమా అవకాశాలు దక్కించుకొని రెజీనా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించింది. కానీ, ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే రెజీనా ప్రస్తుతం పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్దమయ్యారట. ఓ బిజినెస్‌మెన్‌ను ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరిగాయని, త్వరలో ఈ శుభవార్తను రెజీనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్‌. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button