తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

Tollywood: అల్లు అర్జున్ కోసం సినిమా ఇండస్ట్రీ మొత్తం తల దించుకుందా?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చిలికి చిలికి గాలివానలా మారింది. మొదట్లో అల్లు అర్జున్ వర్సెస్ పోలీసులు అన్నట్లుగా మొదలైన ఇష్యూ ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్.. అనంతరం టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లుగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కలిసి నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా బెనిఫిట్ షోలు, టిక్కెట్స్ రేట్స్ పెంపుపై సీఎం ‘తగ్గేదే లే’ అని చెప్పేశారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో తన నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పేశారు. అయితే అడిగిన వరం ఇవ్వని సీఎం రేవంత్.. సినిమా ఇండస్ట్రీకి అడగకుండానే మరో వరం ఇచ్చారు. హైదరాబాద్‌ను టాలీవుడ్‌కే కాదు, ఏకంగా హాలీవుడ్ వాళ్లు సైతం సినిమాలు తీసుకునేలా హబ్‌గా మారుస్తారట. ఇది విన్న సినీ పెద్దలు లోపల ఏం అనుకున్నారో తెలీదు గానీ.. ‘సీఎం గారూ, ప్రభుత్వం సూపర్.. బంపర్’ అంటూ మీడియా ముందు ఏదో ఊదరగొట్టేశారు. తెచ్చుకున్న శాలువాలు వెనక్కి తీసుకెళ్లడం ఎందుకులే అనుకొని ఏదో మొక్కుబడిగా సీఎం గారికి శాలువాలు కప్పారు, సన్మానాలు చేశారు.

అల్లు అర్జున్ ఇగో వల్లే..!

అసలు సీఎంతో భేటీ ద్వారా సినీ పెద్దలు సీఎంను ఏం అడగాలనుకున్నారు? చివరకు వాళ్లు ఏం సాధించినది ఏంటి? అసలు సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం రేవంత్ ఇలా.. పట్టువిడుపులు లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ భేటీపై సినీ పరిశ్రమలోనే కొందరి నుంచి విమర్శలు వస్తుండటం కూడా చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ విషయంలో సీఎంను ‘కూల్’ చేసేందుకే సినిమా ఇండస్ట్రీ పెద్దలు రేవంత్‌ను కలిశారన్న వార్తల నేపథ్యంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క అల్లు అర్జున్ వల్ల, ఆయన ఇగో వల్ల సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ సీఎం ముందు కూర్చొని, తల దించుకోవాల్సి వచ్చిందని అన్నారు. తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. మరి దీనిపై ఇండస్ట్రీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button