తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: మన హీరోలు.. రియల్ హీరోలు.. ఆపత్కాలంలో అండగా నిలబడ్డారు!

టాలీవుడ్ హీరోలు తాము రీల్ హీరోలు మాత్రమే కాదని, రియల్ హీరోలం అని కూడా నిరూపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించారు. తమ సినిమాలను చూసి ఆదరించి, అభిమానించే తెలుగు ప్రేక్షకులను ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకునేందుకు ఎందరో టాలీవుడ్ హీరోలు ముందుకు వచ్చారు, వస్తున్నారు. తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి విరాళాలు అందిస్తూ పెద్ద మనుసు చాటుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏపీకి రూ. కోటి, తెలంగాణకు రూ. కోటి చొప్పున మొత్తం రూ. 2 కోట్లు విరాళంగా ప్రకటించారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్ కోటి రూపాయలు ప్రకటించారు. ఇందులో తెలంగాణకు రూ.50 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.50 లక్షలు చొప్పున అందజేయనున్నారు. బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా ఇరు రాష్ట్రాలకు చెరొక రూ. కోటి చొప్పున ప్రకటించారు.

Also Read: రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన ‘బాహుబలి’

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా ఏపీకి రూ. కోటి, తెలంగాణకు రూ. కోటి, ఏపీలోని 400 మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 6 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఇక యువ హీరోలు సాయిదుర్గాతేజ్ ఇరు రాష్ట్రాలకు రూ. 25 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ.15 లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు చొప్పున ముప్ఫై లక్షలు అనౌన్స్ చేశారు. అలాగే విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ, నాగవంశీలతో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ రెండు రాష్ట్రాలకు చెరొక రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు. నిర్మాత అశ్వినీదత్ ఏపీకి రూ.25 లక్షల విరాళం అందజేస్తామన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెలంగాణకు రూ.5 లక్షలు, ఏపీకి రూ.5 లక్షలు చొప్పున ప్రకటించారు. ప్రముఖ కమెడియన్ అలీ ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 3 లక్షల చొప్పున మొత్తం 6 లక్షలు విరాళం ప్రకటించారు. ఇక హీరోయిన్ అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాలకు చెరో రెండున్నర లక్షల చొప్పున ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి సైతం తెలుగు రాష్ట్రాలకు చెరొక రూ. కోటి చొప్పున మొత్తం రూ. 2 కోట్లు విరాళం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button