తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: టార్గెట్ టాలీవుడ్.. సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్‌కం టాక్స్ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. నిన్నటి నుంచి సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ‘పుష్ప-2’ డైరైక్టర్ సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇటీవలే సుకుమార్ పుష్ప-2తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే పుష్ప-2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు నిర్ధారణ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌పై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు.

నిన్నటి నుంచి రైడ్స్

కాగా.. నిన్న ఉదయం నుంచి తెలుగు సినీ సరిశ్రమకు చెందిన ప్రముఖులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్లోనూ సోదాలు జరిపారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button