తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: ప్రభాస్‌తో పోటీ… రేస్‌లో ముగ్గురు హీరోలు!

ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే సాధ్యమయ్యే భారీ కలెక్షన్స్‌ని ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ అవలీలాగా దాటేస్తున్నారు. ఈ జాబితాలో ముందువరుసలో హీరో ప్రభాస్ ఉంటాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2తో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగి ఎక్కిడికో వెళ్ళింది. టాలీవుడ్ సినిమా చరిత్రలో ఏ హీరో సాధించలేని కలెక్షన్స్ అప్పట్లో బాహుబలి -2 రాబట్టింది.

అయితే టాలీవుడ్‌లో రాజమౌళికి సాధ్యమయినా రూ.1000 కోట్ల మార్క్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా అందుకున్నారు. ఈ సినిమాలో కూడా హీరో ప్రభాసే కావడం గమనార్హం. ఇంతకీ ఆ చిత్రం ఏదని అకుంటున్నారా! అదే ‘కల్కి 2898AD’. ఈ చిత్రం సూపర్ హిట్ తో ప్రభాస్ రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించారు. ఇంకా కొన్ని చోట్ల ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

ఈ క్రమంలోనే ప్రభాస్ తర్వాత ఏ హీరో రూ.1000 కోట్లు కొల్లగొడుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపైనే టాలీవుడ్‌‌‌లో చర్చ నడుస్తుంది. ఈ రేస్ లో ప్రస్తుతం ముగ్గురు హీరోలు ఉన్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప తెలుగుతో పాటు నార్త్ లో అదిరే కలెక్షన్స్ రాబట్టింది. వీరి కాంబోలో రాబోతున్న పుష్ప -2 రూ.1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు అవకాశం ఉందని ట్రేడ్ టాక్. ఇక ‘RRR’తో సూపర్ హిట్ సాధించిన రామ్ చరణ్, jr.ఎన్టీయార్ లకు నార్త్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. శంకర్, రామ్ చరణ్ కలయికలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ఫై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించడం మ్యాటర్ కాదు.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే రూ.1000కోట్లు రాబట్టి తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button