తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: కష్టాల్లో ముగ్గురు హీరోలు… హిట్ కొట్టాకపోతే మూట ముల్లె సర్దుకోవాల్సిందేనా?

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ పైనే హీరోల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఏజ్‌తో కూడా సంబంధం లేకుండా ఆరవై ఏళ్లు నిండిన సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారంటే దానికి కారణం వారి సినిమాలను ప్రేక్షకులు ఆధారించడమే. ఇండస్ట్రీలో నిర్మాతలు కూడా హిట్ కొట్టిన హీరోతోనే సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతారు. ఒక్క బిగ్ హిట్ వచ్చిందంటే తమతో అంటే తమతో మూవీ చేయమని ఆపర్ల మీద ఆఫర్లు ఇస్తారు. అదే ఒక ఫ్లాప్ పడితే కనీసం ఫోన్ కూడా ఎత్తరు. ఎక్కడైనా కనిపించినా చూసి చూడనట్టు వ్యవరిస్తారు. ఆఫర్ల సంగతి అయితే సరే సరి. అలా ఉంటుంది ఇండస్ట్రీ లెక్క. ప్రస్తుతం టాలీవుడ్ లోని ఓ ముగ్గురు హీరోలు అర్జెంటుగా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితి.

ఆ ముగ్గురు హీరోలు హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. దీంతో ఇప్పుడు వారు చేసే సినిమాలు హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వారి పరిస్థితి టాలీవుడ్‌లో అధ్వానంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు. ఇంతకీ ఈ ముగ్గురు హీరోలు ఎవరని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవండి.

టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ కెరీర్ ఒక హిట్టు రెండు ఫ్లాప్ లు అన్న చందంగా సాగుతోంది సినీ కెరీర్. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు అనుకుంటే వారియర్, స్కంద ఫ్లాప్స్ తో అలా కిందికి వెళ్ళాడు. ప్రస్తుతం తనకు సూపర్ హిట్ ఇచ్చిన పూరితో కలిసి డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ వస్తున్నాడు. ఈ సినిమా విజయం రామ్ కెరీర్ కు చాలా కీలకం కానుంది.

ఇక మరో యంగ్ హీరో నితిన్ అప్పుడెప్పుడో వచ్చిన ‘భీష్మ’ తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఒకదానిని మించి ఒకటి డిసాస్టర్ లు కొట్టాడు. తాజాగా మరోసారి వెంకీ కుడుములతో కలిసి రాబిన్ హుడ్ లో నటిస్తున్నాడు. హిట్ కొట్టలేదంటే ఇంకా సర్దుకోవడమే. వీరి బాటలో నడుస్తున్న మరో కుర్ర హీరో శర్వానంద్ ‘శతమానం భవతి’ చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఆ తర్వాత శర్వాను కూడా వరుస ప్లాప్ లు పలకరించాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలపైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button