తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

VD12: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..?

హీరో విజయ్ దేవరకొండకు గత రెండు, మూడేళ్లుగా ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత ‘ఖుషి’ వంటి క్లాసిక్ ఫ్యామిలీ మూవీతో వచ్చినా అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో రౌడీ ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సాలిడ్ కం బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రౌడీ హీరో.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘VD12’పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.

మార్చి 30 రిలీజ్?

అంతేకాదు, VD 12 సినిమాను ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత నాగవంశీ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఫస్ట్ పార్టుకు సంబంధించి ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ అగ్రెసివ్ లుక్‌, షార్ట్ హెయిర్ కట్, గడ్డంతో కనిపిస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. ఇక, ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో అప్డేట్ కూడా అందింది. గతంలో మార్చి 28న ఈ మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం. వేసవి కానుకగా మార్చి 30న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button