
Venkatesh: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న వెంకీ మామా!
ఫ్యామిలీ స్టార్ వెంకీ మామా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి – వెంకీ మామా కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం!’ మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా చూసి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేశ్ తన కామెడీ టైమింగ్‌తో, మేనరిజంతో థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నారు.
త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి !
కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా దూసుకుపోతోంది. మొదటి రోజే రూ. 45 కోట్లకు పైగా భారీ వసూళ్లు రాబట్టి.. వెంకీ మామా కెరీర్‌లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఇక, రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.