తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Venky: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకీ మామ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్!

‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తర్వాత హీరో వెంకటేశ్‌ – డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు దీనిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ఖరారు చేసింది. 2025లో సంక్రాంతి పండుగకు దీనిని ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నట్లు తెలిపింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

క్రైం, కామెడీ

క్రైమ్‌ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్‌ రెడ్డి ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. అయితే ఇప్పటికే రామ్‌చరణ్‌-శంకర్‌ కలయికలో దిల్‌ రాజు నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ జనవరి 10న సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు దిల్‌ రాజు నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తుండటం విశేషం. ఈ ప్రకటనతో ఈ సంక్రాంతి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button