Vijay Devarakonda: రష్మికతో డేటింగ్.. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్షిప్‌లో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. వీరికి సంబంధించిన వీడియోలు అనేకసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ సైతం తాను ఓ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నానని ఓ కార్యక్రమంలో అన్నారు. ఇటీవల పుష్ప-2 చెన్నై ఈవెంట్లో రష్మిక మందన్నా కూడా ఈ విషయంపై కొంత వరకు క్లారిటీ ఇచ్చేశారు. ఇక, తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ డేటింగ్ రూమర్స్‌పై మరోసారి స్పందించారు. హీరోయిన్‌తో తన రిలేషన్షిప్ గురించి యాంకర్ ప్రశ్నించగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ రోజున తప్పకుండా స్పందిస్తా!
‘నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలి. కాబట్టి, అలాంటిరోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అదీ.. వృత్తిలో భాగంగానే భావిస్తా. దానినుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా’ అని అన్నారు.