Vijay Devarakonda: ‘పుష్ప-3’లో విలన్‌గా విజయ్ దేవరకొండ?
ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కిన పుష్ప-2 ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న భారీ స్థాయిలో విడుదలకు సిద్దమైంది. అల్లు అర్జున్ -సుకుమార్‌ల ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే విడుదలకు ముందే ఈ మూవీ ఎన్నో రికార్డులు సృష్టించింది. బాహుబలి-2, కేజీఎఫ్-2 వంటి చిత్రాల రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదలవుతున్న మొదటి ఇండియన్ మూవీ రికార్డు సృష్టించింది. విడుదలకు ముందే ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, ఈ మూవీలో హీరోయిన్ రష్మిక, స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
క్రేజీ కాంబో..!
ఇదిలా ఉంటే.. రేపు పుష్ప-2 విడుదల అవుతున్న సందర్భంలో సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. పుష్ప-2కి సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి షేర్ చేసిన ఓ ఫోటోతో పుష్ప-3 కూడా ఉంటుందని కన్‌ఫర్మ్ అయ్యింది. అయితే అందులో విలన్‌గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడో భాగంలో మెయిన్ విలన్‌గా విజయ్ దేవరకొండ ఉంటారని, ‘పుష్ప-3: ది ర్యాంపేజ్’ గురించి ఆయన 2022లోనే ఓ ట్వీట్‌తో హింట్ ఇచ్చారని నెటిజన్లు తాజాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే ఈ మూవీకి ఓ రేంజ్‌లో హైప్ రావడం పక్కా అని, హీరోహీరోయిన్లుగా అల్లు అర్జున్, రష్మిక.. విలన్‌గా విజయ్ దేవరకొండను చూడటం క్రేజీగా ఉంటుందని చెబుతున్నారు.