Vijay Sethupati: రామ్ చరణ్ సినిమాలో నటించట్లేదు.. విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు!
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘విడుదల-2’. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్లతో విజయ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోనూ ఈ మూవీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు.
టైం దొరకలేదు!
బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దాంతో, ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు.. విజయ్‌కు మరో అవకాశం ఇచ్చారని కొన్ని నెలల కిత్రం ప్రచారం జరిగింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న #RC 16లో సేతుపతి కీ రోల్ పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఆయన తాజాగా స్పందించారు. తాను రామ్ చరణ్ మూవీలో నటించట్లేదని తెలిపారు. ఆ చిత్రంలో నటించేందుకు తనకు సమయం లేదని అన్నారు.