తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Vishwaksen: ‘లైలా’గా విశ్వక్‌సేన్.. ఫస్ట్ లుక్ రిలీజ్

వరుస హిట్ సినిమాలతో విశ్వక్ సేన్ దూసుకుపోతున్నారు. ఇటీవల గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టారు. విశ్వక్ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. త్వరలో మెకానిక్ రాకీ సినిమాతో విశ్వక్ రాబోతున్నారు. తాజాగా మరో కొత్త సినిమాని మొదలుపెట్టారు. ఇక విశ్వ‌క్ న‌టిస్తున్న ప్రాజెక్ట్‌ల‌లో ఒక‌టి VS12. ‘లైలా’ అనే టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు.

షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం నేడు అధికారికంగా పూజ కార్య‌క్రామ‌లు పూర్తి చేసుకుంది. ఈ వేడుక‌కు.. దర్శక దిగ్గజం కే రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా వచ్చి ముహూర్తం క్లాప్ కొట్టగా.. హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ లాంచ్ చేశారు. ఆకాంక్ష శర్మ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో కనిపించబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. తనిష్క్‌ బాగ్చి మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button