తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Vizag: విశాఖకు టాలీవుడ్ పరిశ్రమ తరలిపోనుందా?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖను టాలీవుడ్ హబ్‌గా మార్చాలని, విశాఖ పాలనా రాజధాని అయితే చిత్రపరిశ్రమ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఇక్కడ బడా నిర్మాతలు, స్టార్ హీరోలు అందుకు సహకరించలేదు. స్టూడియోలు కడతామని అనుకుంటే భూములు కూడా ఇస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం విశాఖను సినీ రాజధానిగా చేస్తామని ఊదరగొడుతోంది. టీడీపీ కూటమికి చలన చిత్ర పరిశ్రమ పెద్దల మద్దతు ఉంది. కాబట్టి సినీ పరిశ్రమ త్వరలోనే ఏపీకి తరలివస్తుందన్న చర్చ సాగుతోంది.

టాలీవుడ్ హబ్‌గా విశాఖ

అంతేకాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు విశాఖపట్నం అన్ని విధాల అనుకూల ప్రాంతమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీలో స్టూడియోల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం జరిగి చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button