Youtube: ‘కుర్చీ మడతపెట్టి’ సన్సేషన్.. ఈ ఏడాది ఇండియాలోనే టాప్ సాంగ్‌గా రికార్డు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరుకారం’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి తమన్ అందించిన పాటలు మ్యూజిక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ అయితే ఒక ఊపు ఊపేసింది. యూట్యూబ్‌ని షేక్ (526 మిలియన్ వ్యూస్) చేసేసింది. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.
ఇండియా నుంచి ఒకే ఒక్క పాట
ఇక, తమ ప్లాట్‌ఫామ్‌లో టాప్‌లో నిలిచిన పాటల జాబితాను తాజాగా యూట్యూబ్ విడుదల చేసింది. ఏయే దేశాల నుంచి ఏ పాట టాప్‌లో ఉందో ఈ జాబితాలో తెలియజేసింది. ఇండియా నుంచి ఆ జాబితాలో నిలిచిన ఏకైక పాట ‘కుర్చీ మడతపెట్టి’ అని ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఏడాది ఎన్నో పాటలు విడుదలైన విషయం తెలిసిందే. వాటన్నింటిని పక్కకు నెట్టి ‘కుర్చీ మడతపెట్టి’ పాట టాప్‌లో నిలవడంపై సంగీత దర్శకుడు తమన్, నటి శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు.