తెలుగు
te తెలుగు en English
సినిమా

Vishal: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో.. అసలు విశాల్‌కి ఏమైంది..?

హీరో విశాల్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన తమిళ్ హీరోనే అయినా తెలుగులోనూ ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో విశాల్ కుటుంబ మూలాలు ఉన్నాయి. ఇక, ఆయన నటించిన ఏ మూవీ అయినా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. పందెంకోడి, భరణి, పూజ వంటి అనేక సినిమాలు తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణను దక్కించుకున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా విశాల్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చేతులు వణుకుతూ..!

గతేడాది రత్తం (తెలుగులో రత్నం) సినిమాలో చివరిగా కనిపించారు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.. బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నారు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్‌కు ఏమైందోనని తెగ కంగారు పడుతున్నారు. 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న విశాల్ సినిమా ‘మదగజరాజ’ ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విశాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button