తెలుగు
te తెలుగు en English
సినిమా

Rape Cases: మొన్న జానీ మాస్టర్.. నిన్న హర్షసాయి.. ఇవాళ మల్లిక్ తేజ్.. సెలబ్రిటీలే ఎందుకిలా?

ఇటీవల కాలంలో సోషల్ మీడియా సెలబ్రెటీలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు నార్సింగి పోలీసులు. అలాగే ఫేమస్ యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచార ఆరోపణలు చేసింది మరో యువతి. ప్రేమ పేరుతో తనను మోసం చేసి రూ. 2 కోట్ల వరకు డబ్బు తీసుకున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకు ముందు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై సైతం ఇవే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై కూడా అత్యాచార ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా మల్లిక్!

యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై రేప్ కేసు నమోదైంది. మాయ మాటలు చెప్పి తనపై ఆత్యాచారం చేశాడని, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ యువతి ఫిర్యాదులో పేర్కొంది. బాధిత యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దుర్భాషలాడాడని పేర్కొంది. దీంతో మల్లిక్ తేజ్‌పై జగిత్యాల జిల్లా పోలీసులు రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మల్లిక్ తేజ్ రైటర్ కమ్ సింగర్. అతడి పాటలకు యూట్యూబ్‏లో అత్యధిక వ్యూస్ ఉన్నాయి.

Leave a Reply

Back to top button