తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Alliance: కూటమిలో లుకలుకలు.. ఉమ్మడి మేనిఫెస్టో వేదికపై కనిపించని మోదీ ఫోటో!

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఆదిలోనే లుకలుకలు మొదలయ్యాయి. ఇది కేవలం అవకాశవాద, స్వార్థపూరిత పొత్తు అని, ఇది ఎక్కువకాలం నిలబడదన్న సీఎం జగన్ మాటలే నిజమవుతున్నాయి. ఇవాళ గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తోంది. అయితే ఈ సభా వేదికగా ఈ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ సభా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. నరేంద్ర మోదీ ఫోటోగానీ, పురందేశ్వరి ఫోటో గానీ లేవు. అంటే కూటమిలో బీజేపీకి ఏమాత్రం ప్రాధాన్యం లేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పరోక్షంగా సంకేతమిచ్చారు. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్‌గా ప్రకటించిన ఈసీ

ఇది చంద్రబాబు స్కెచ్చేనా?

అయితే, పరిణామం వెనుక చంద్రబాబు స్కెచ్ ఉన్నట్లు కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేనలు కొంతకాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.. అందుకు కారణం.. సీఎం జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ గానీ, కేంద్ర బీజేపీ నేతలు విమర్శలు చేస్తారని, ఆ విమర్శలను ఆసరాగా చేసుకొని వైసీపీ మీద దుమ్మెత్తి పోయాలని, చంద్రబాబు భావించారు. అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం అందుకు విరుద్ధంగా జగన్ విషయంలో ఏమీ స్పందచడం లేదు. ఇటీవల జరిగిన కూటమి సభలోనూ ప్రధాని మోదీ ఎక్కడా సీఎం జగన్‌‌పైన విమర్శలు చేయలేదు. అయినా రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తూంటే ఏ జాతీయ నాయకుడైనా ఎలా విమర్శిస్తారు. అందుకే జగన్ విషయంలో మోదీ మౌనంగా ఉన్నారు. అయితే, ఈ పరిణామమే చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. అందుకే మోదీ ఫోటోని మేనిఫెస్టో వేదికపై ఏర్పాటు చేయలేదని వార్తలు వస్తున్నాయి.

ALSO READ:  రాష్ట్రంలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అమలు కావడం లేదు: మంత్రి ధర్మాన

ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లు వారి వ్యవహరం కొనసాగుతోంది. అందుకు నిదర్శనంగా అనేక సంఘటనలు జరిగాయి. టిక్కెట్ల కేటాయింపులో ఇప్పటికే పలు చోట్ల కూటమిలోని నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీకి టీడీపీకి, జనసేనకు బీజేపీకి మధ్య చాలా చోట్ల సీట్ల పంపకాల విషయంలో గొడవలు జరిగిన విషయం కూడా తెలిసిందే. ఈ తాజా పరిణామంతో కూటమిలో ఉన్న ఐక్యత ఏపాటిదో రాష్ట్ర ప్రజలకు మరోసారి స్పష్టమైపోయింది.

సంబంధిత కథనాలు

Back to top button