తెలుగు
te తెలుగు en English
Linkin Bioఆంధ్రప్రదేశ్

Allu Arjun: పవన్‌ను పొగిడేసిన అల్లు అర్జున్.. ఇక వార్ ముగిసినట్టేనా?

అల్లు – మెగా ఫ్యామిలీ వార్‌కి ఎండ్ కార్డు పడినట్లేనా? రెండు కుటుంబాల మధ్య గత 8 నెలలుగా కొనసాగుతున్న ఇంటర్నర్ వార్ ఇక ఇంతటితో ముగిసినట్లేనా? సోషల్ మీడియాలో ఇరువురు ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న యుద్ధానికి తెరపడినట్టేనా? అంటే కొంచెం అటూ ఇటూగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్‌పై పొగడ్తల వర్షం కురిపించిన నేపథ్యంలో ఇక, ఈ వివాదం సర్దుమణిగినేట్టేనని వినిపిస్తోంది.

పవన్ ధైర్యమంటే చాలా ఇష్టం!

బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాప‌బుల్ షో’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పాల్గొని సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో తాజాగా రిలీజైంది. ఇందులో అల్లు అర్జున్ తన వ్యక్తిగత కెరీర్ గురించి, సినిమాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సినీ రంగానికి చెందిన హీరోల గురించి కూడా మాట్లాడారు. కొంతమంది హీరోల ఫొటోలు చూపించి వాళ్ల గురించి బన్నీని అడిగారు బాలయ్య. ఇందులో పవన్ కళ్యాణ్ ఫోటో చూపించగా అల్లు అర్జున్.. ‘ఆయన ధైర్యం అంటే నాకు ఇష్టం. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ పీపుల్‌ను చూస్తుంటాను. కానీ నేను లైవ్‌లో దగ్గర్నుంచి ఆయన్ని చూసాను. చాలా డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు’ అని పొగడ్తలు కురిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో మొదలైన ఈ వివాదం చిలిచి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే. తాజాగా బన్నీ వ్యాఖ్యలతో ఈ వివాదానికి ముగింపు దొరికినట్టేనని భావించాల్సి వస్తోంది. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తొలిగిపోవడానికి, ఫ్యాన్ వార్స్ ఆగిపోవడానికి ఈ స్టేట్‌మెంట్ ఒక్కటే సరిపోదని, ఇంకా ఏదో కావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు వినికిడి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button