తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Cabinet: వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇతర శాఖల్లో విలీనం.. ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన మద్యం విధానానికి ఆమోదం తెలపడంతో పాటు, వాలంటీర్లను, గ్రామ సచివాలయ సిబ్బందిని ఇతన శాఖల్లో విలీనం చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్రంగా చర్చించి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సమావేశం నిర్ణయించిందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
రాష్ట్రంలో 2 లక్షల 63 వేల మంది వాలంటీర్లు ఉండగా వారిలో లక్షా 07 వేల మంది రాజీనామా చేయగా లక్షా 10 వేల మంది ఉన్నారని వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తామన్నారు. అంతేకాదు, వాలంటీర్లు, సచివాలయాలకు దినపత్రికల కొనుగోలుకు నెల నెలా ఇచ్చే రూ. 200 రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

కౌలు రైతులకు పరిహారం!

ఇక, నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు, సగటు మద్యం ధర రూ. 99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, విశాఖపట్నం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. పోలవరం డయాప్రమ్‌ వాల్‌ నిర్మాణం పనులు పాత ఏజెన్సీకే ఇవ్వాలని, మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల, ఇటీవల ఏపీలో వరదల వల్ల పంటలకు జరిగిన నష్టంపై కౌలు రైతులకు పరిహారం దక్కేలా చూడాలని నిర్ణయించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button