తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: పదో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. కొనకనమెట్లలో బహిరంగ సభ

వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పదో రోజుకు చేరుకుంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన బస్సుయాత్ర.. పెద్దఅలవలపాడు, కనిగిరి చేరుకుంది. యాత్రలో కలిసిన పిల్లలు, వృద్ధులు, మహిళలతో సీఎం జగన్‌ ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత సీఎం జగన్‌ను రామాపురం గ్రామస్తులు కలిశారు. తమ గ్రామంలో వైసీపీ ప్రభుత్వం నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్.. ఇలా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలందుతున్నాయంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

ALSO READ: అందరికీ మంచి చేశా.. ఇలా చంద్రబాబు చెప్పగలడా?.. సీఎం జగన్

దారిపొడవునా స్వాగతం…

జువ్విగుంట క్రాస్ నుంచి బయలుదేరిన సీఎం జగన్‌ బస్సు యాత్రకు దారిపొడవునా స్వాగతం పలుకుతున్నారు. కె. అగ్రహారం గ్రామ ఎంట్రన్స్ వద్ద గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. ఈ మేరకు భారీ క్రేన్స్‌తో 10 గజమాలలతో కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. కాగా, పెద్ద అరికట్ల తర్వాత భోజన విరామం తీసుకుంటారు. ఇక్కడినుంచి పెద్ద అరికట్ల మీదుగా సాయంత్రం 3.30 గంటలకు కొనకనమెట్ల క్రాస్‌ దగ్గర బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల, పొదిలి, రాజంపల్లి దర్శి మీదుగా వెంకటాచలంపల్లి చేరుకొని అక్కడే రాత్రి బస చేయనున్నారు.

ALSO READ: గూగుల్‌ ట్రెండ్స్‌.. టాప్ లేపిన సీఎం జగన్

ప్రతి ఒక్కరితో సెల్ఫీలు..

సీఎం జగన్‌ను చూసేందుకు జనాలు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్క చేయక.. దారిపొడవునా జనసునామీలా వచ్చారు. తన కోసం వచ్చిన వారిని సీఎం జగన్‌ ఆప్యాయంగా పలకరిచి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు, యువతులు, వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరితో సెల్ఫీలు దిగి వారిలో ఆనందోత్సాహాలను నింపారు. అంతకుముందు వైఎస్‌ జగన్‌ సమక్షంలో దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేతలు వైసీపీలో చేరారు. ఈ మేరకు వారికి సీఎం జగన్ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button