తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: మోగిన ఎన్నికల నగరా.. వృద్ధులకు ఇంటి వద్దే ఓటు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్టాలకు ఎన్నికల తేదీని కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 25 నామినేషన్లకు చివరి గడువు, ఏప్రిల్ 26న స్కుటినీ, 29న నామినేషన్ల ఉపసంహరణ ఉండగా.. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ALSO READ: వైసీపీ ఫైనల్ లిస్ట్.. మరోసారి పులివెందుల నుంచే సీఎం జగన్

ఒకే విడతలో ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనునట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఇందుకోసం 46 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుపుతామని తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఈసారి 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ALSO READ: బీజేపీలో టికెట్ల పంచాయితీ.. చంద్రబాబుపై ఫిర్యాదు!

గెలుపే లక్ష్యంగా..

175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇవాళ 175 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 151 స్థానాలో వైసీపీ విజయం సాధించింది. ఇక టీడీపీ 23 స్థానాలు గెలుచుకోగా, జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. గత 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాల్లో 22 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.

సంబంధిత కథనాలు

Back to top button