తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ఏపీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.. ఐదేళ్లలో జగన్ చేసింది ఇదే!

ఏపీకి కోస్తా తీరం బాగుందని, దాన్ని ఏపీ సక్రమంగా వినియోగించుకుంటే ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎంతగానో పుంజుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఓడరేవులు, నౌకాశ్రయాలను నిర్మించడం ద్వారా ఈ బ్లూ ఎకానమీ డెవలప్‌మెంట్‌పై వైఎస్ జగన్ దృష్టి సారిస్తున్నారన్నారు. సముద్ర ఆధారిత వాణిజ్యం (బ్లూ ఎకానమీ)పై దృష్టిసారించిన సీఎం జగన్.. ఈ ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ALSO READ: రూట్ మార్చిన బాబు.. తిట్టిన నోటితోనే మోదీపై పొగడ్తల వర్షం!

ఏపీకి సహజ వనరులు

ఏపీకి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు వ్యవసాయం, కోస్ట్ లైన్, పరిశ్రమల్లో అభివృద్ధి చెందితే ఉపాధి, ఆదాయాన్ని సృష్టించవచ్చు. ఈ అంశాలపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే యూరప్‌లోనే అతిపెద్ద పోర్టుగా పేరొందిన నెదర్లాండ్స్‌లోని రోట్టర్‌ డ్యామ్, బెల్జియంకు చెందిన యాంట్‌వెర్ప్‌లతో కలిసి పనిచేసేందుకు అడుగులు వేశారు. ఇటీవల దావోస్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ మారిటైమ్‌ బోర్డు ప్రతినిధులు రోట్టర్‌ డ్యామ్, యాంట్‌వెర్ప్‌ పోర్టు ప్రతినిధులను కలిసి రాష్ట్రంలోని పోర్టుల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఏపీలో సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే.

ALSO READ: కొత్త మేనిఫెస్టో రూపకల్పన..మార్చి 20న విడుదల

బ్లూ ఎకనమీ అంటే..

సముద్రాలు, సముద్ర తీరాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలే బ్లూ ఎకానమీ. ఇది సము ద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సముద్ర పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ఇందుకు అనుగుణమైన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మెరుగుదలకు సముద్ర వనరులను స్థిరంగా, పటిష్ట స్థాయిలో వినియోగించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. అయితే అంతర్జాతీయ పోర్టులతో చేతులు కలపడం ద్వారా విదేశీ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం రాష్ట్ర పోర్టులకు వేగంగా కలగనుంది.

13 Comments

  1. A p development లో వెలిగి పోతుంది ప్రపంచడేసాలన్ని ap వైపు చూస్తున్నాయి ఇండస్ట్రీస్ projects ఒకటేమిటి అన్నీ రంగాలలోనూ అభివృధి పరుగులు పెడుతుంది పెట్టుబడిదారులు que కడుతున్నారు ప్రపంచ దేశాలలోని యూత్ అంతా ఉద్యోగాల కోసం ap ki పరుగుతీస్తున్నరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button