తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: బీజేపీతో పొత్తు కోసం కళ్లుకాయలు కాసేలా చంద్రబాబు ఎదురుచూపులు!

రానున్న ఎన్నికలకు ఒంటరిగా వెళ్తే నెగ్గలేమని తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీతో పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే జనసేనతో జతకట్టిన టీడీపీ..తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీకి బీజేపీతో జట్టు కట్టించి పొత్తుకు ఒప్పించడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు వైఖరి తెలిసిన బీజేపీ టీడీపీని దూరం పెడుతూ వస్తోంది. అయితే బీజేపీతో పొత్తు కోసం కళ్లుకాయలు కాసేలా చంద్రబాబు ఎదురుచూస్తున్నారు.

ALSO READ: మహారాష్ట్రలో ఎటూ తేలని సీట్ల పంచాయతీ!

కండీషన్‌‌కు బాబు ఓకే!

బీజేపీతో పొత్తు కోసం బాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పావులా వాడుకుంటున్నాడు. జనసేనకు 24 సీట్లు కేటాయించిన టీడీపీ.. ఒక్క శాతం ఓటు షేర్ కూడా లేని బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వడానికైనా బాబు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నాడు. ఈ విషయం గ్రహించిన బీజేపీ.. పొత్తు ఉండాలంటే తాము అడిగిన స్థానాలివ్వాలనే కండీషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ అండగా ఉంటే కానీ.. ముందుకెళ్లలేమని అర్థమైన చంద్రబాబు బీజేపీ అడిగిన అన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

ALSO READ:  11వ జాబితా విడుదల చేసిన వైసీపీ

వెంటాడుతున్న కేసులు

మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా… చంద్ర‌బాబుని కేసులు ఒక‌దాని వెంట మ‌రొక‌టి వెంటాడుతున్నాయి. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న స్కిల్, ఫైబర్‌నెట్, క్యాపిటల్ కేసులు, గచ్చిబౌలి భూకేటాయింపు వంటి కేసులు బాబును క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఈ కేసులపై ఆంధ్రతోపాటు తెలంగాణ హైకోర్టు తీర్పులు త్వరలో రానున్నాయి. అలాగే రానున్న ఎన్నికల్లో ఓడిపోతామని తెలుసుకున్న బాబు మరో సమస్య వేధిస్తోంది. ఈసారి జగన్ అధికారంలోకి వస్తే తనను వదిలిపెట్టడని బాగా తెలుసు. ఇందులో భాగంగానే ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్ర‌బాబు.. బీజేపీ కూటమిలో భాగం కావాలనుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button