తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై కేడర్‌కు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. దాదాపు అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని, నియోజకవర్గం కో ఆర్డినేటర్లే ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్పారు. కావున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ నేతలు సిద్ధం కావాలని సూచించారు.

ALSO READ: స్పీకర్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఓటర్లను ఐదారుసార్లు కలవండి

త్వరలోనే ఎన్నికలు ఉన్నందున బూత్‌స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్‌ చేయాలని నాయకులకు సీఎం జగన్ సూచించారు. రేపటి నుంచి 45 రోజులు చాలా కీలకమని, ఈ సమయంలో అందరూ సమన్వయంతో కలిసి మెలిసి పని చేయాలన్నారు. బూత్‌స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం 5 నుంచి 6 సార్లు కలవాలని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరించాలన్నారు. ఈ 58 నెలల్లో మనం చేసిన మంచి పనులు, భవిష్యత్తులో చేసే మంచి పనులు చెప్పాలని వెల్లడించారు.

ALSO READ: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. మరో రెండు గ్యారెంటీలు అమలు

విషప్రచారం తిప్పి కొట్టండి

విపక్షాలు చేసే విషప్రచారాన్ని తిప్పి కొట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వైసీపీ మళ్లీ గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థతో సుపరిపాలన అందిస్తామని, లేదంటే జన్మభూమి కమిటీల అరాచకం మొదలవుతుందన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజనర్‌ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, జగనన్న సచివాలయ కన్వీనర్లు హాజరయ్యారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button