తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: నామినేషన్ వేసేందుకు సీఎం జగన్ ముహూర్తం ఫిక్స్! అక్కడే రెండురోజులు మకాం!

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార వైసీపీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర 12వ రోజుకు చేరుకుంది. ఈ యాత్ర ఈనెల 21వ తేదీతో శ్రీకాకుళం జిల్లాతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఎన్నికలకు ఈనెల 18న నోటిఫికేషన్ వస్తుండడంతో 22వ తేదీన పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ వేసేందుకు నిర్ణయించారు. ఒకవేళ పాదయాత్రలో ఒకరోజు బ్రేక్ ఉంటే 23న దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ALSO READ: సంచలన సర్వే.. వైసీపీకే మళ్లీ పగ్గాలు!

ఎన్నికల ప్రణాళిక సిద్ధం

నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పర్యటనలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజులపాటు సొంత నియోజకవర్గం పులివెందులలోనే మకాం వేసి పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ఆయన సతీమణి వైఎస్ భారతికి ప్రచార బాధ్యతలు అప్పగించి నియోజకవర్గాల వారీగా మే 11వ తేదీన ఎన్నికల ప్రచారానికి తెర పడేంత వరకు 175 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించే దిశగా కార్యాచరణ రూపుదిద్దుకుందని పార్టీ నాయకులు తెలిపారు. రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: చంద్రబాబును నమ్మారు.. దారుణంగా మోసపోయారు!

మేనిఫెస్టోకు తుది మెరుగులు!

రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పథకాల వారీగా లబ్ధిదారుల ప్రయోజనాలను సీఎం జగన్ నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విధంగా వివిధ వర్గాల ప్రజలతొ మమేకమవుతూ పథకాల లబ్ధిదారుల ప్రయోజనాలను క్రోఢీకరించి మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మేనిఫెస్టో, ఎన్నికల హామీలు ఇచ్చి అమలుచేయకపోవడం సమంజసం కాదనే ఉద్దేశంతో మెజార్టీ వర్గం ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాత్రిళ్లు బస చేసిన ప్రాంతాల్లో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతిపాదనలపై ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button