తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీ.. వ్యూహం అదేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ తరుణంలో గోదావరి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గత కొంతకాలంగా జనసేనకు అనుకూలంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. రూటు మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ:  జనసేనకు ఊహించని షాక్.. అచ్యుతాపురం ఇంటిని ఖాళీచేసిన నాగబాబు!

మారుతున్న రాజకీయ సమీకరణాలు

తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జనసేన వైపు మొగ్గు చూసిన కాపు ఉద్యమనేత ముద్ర వర్గం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి ముద్రగడకు ఆహ్వానం అందకపోవడంతో ఆ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో జనసేనలో చేరేది లేదని ముద్రగడ వర్గం తేల్చేసింది. ఈ తరుణంలో ముద్రగడ వర్గంతో వైసీపీ చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ముద్రగడ వైసీపీలోకి వెళ్తే కాపులపై ప్రభావం చూపనున్నట్లు ఆ క్యాడర్‌లో వినిపిస్తోంది.

ALSO READ: కాళేశ్వరం ప్రాజెక్టుపై అధ్యయనం.. 4నెలల డెడ్ లైన్

ఎక్కడ సీటు ఇచ్చినా పోటీ

పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసినట్లయితే.. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించి ఇక్కడినుంచి బరిలో దింపే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌కు ముద్రగడ బలమైన ప్రత్యర్థి అవుతారని, అయితే దీనిపై వైసీపీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం. ఒకవేళ ముద్రగడ వైసీపీలోకి వస్తే.. పిఠాపురం రేసు నుంచి తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు వంగా గీత సంకేతాలు ఇచ్చింది. అయితే అభ్యర్థిత్వం మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని, తనకు ఎక్కడ సీటు ఇచ్చినా పోటీ చేస్తానని వంగా గీత అంటున్నారు. కానీ ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే గోదావరి రాజకీయాల్లో మార్పు ఖాయమని జోరుగా చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button