తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: సోషల్ మీడియాలో ‘సిద్ధం’ ప్రభంజనం..15లక్షల మంది!

సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు అధికార పార్టీ వైసీపీ సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా, బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం జరిగిన ‘సిద్ధం’ సభ రాజకీయ నేతలతోపాటు సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎక్స్‌ (ట్వి­ట్టర్‌)­లో వైఎస్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం జగన్ మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి.

ALSO READ: వైసిపిలోకి ముద్రగడ.. బహిరంగ లేఖ విడుదల

కోటికి పైగానే వ్యూస్…

సిద్ధం సభను సోషల్ మీడియా ద్వారా కోటికి పైగానే వీక్షించినట్లు సమాచారం. సాక్షి ఛానల్‌లోనే లైవ్‌గా లక్ష మందికి పైగా చూడగా..యూట్యూబ్‌లో సాక్షి టీవీ ద్వారా 56 వేల మంది వీక్షించారు. అదే విధంగా యూట్యూబ్‌లో ఎన్‌టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇక, ‘ఎక్స్‌’లో లైవ్‌గా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. కాగా, అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్వహించిన సభను ఎక్స్‌ ద్వారా 2,400 మంది వీక్షించగా, టీఎంసీ లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు.

ALSO READ: కురుక్షేత్రంలో ప్రజలది కృష్ణుడి పాత్ర.. నాది అర్జునుడి పాత్ర!

ఎక్కడా చూసిన సభపైనే చర్చ..

దేశ వ్యాప్తంగా ఎక్కడా చూసిన సిద్ధం సభపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఒక నలుగురు ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారంటే, అది సిద్ధం సభ గురించే ఎక్కువగా డిస్కస్ చేసినట్లు సమాచారం. ఈ విధంగా సీఎం జగన్ ఆ రేంజ్ మేనియాని సృష్టించారు. మరోవైపు సీఎం జగన్ ప్రభంజనం ధాటిని భరించలేక ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు పార్టీలు ఏకం కావడం విశేషం. కాగా, సిద్ధం సభ ఊహించిన దానికంటే పెద్ద హిట్ అయ్యింది. ఎంతలా అంటే.. ఈ సభకి దాదాపుగా 15 లక్షల మంది రావడం రాజకీయ చరిత్రలోనే ఒక సంచలన రికార్డుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

27 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button