తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ప్రజాక్షేత్రంలోనే జననేత..రేపటినుంచి హోరెత్తనున్న ప్రచారం

వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ మేరకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టనున్న బస్సుయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారం హోరెత్తనుంది. ఎన్నికల రణక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసీపీ అధినేత జగన్ జనంలోకి వెళ్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు. 21 రోజుల పాటు కొనసాగే బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలు కవరయ్యేలా వైసీపీ నాయకులు ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు.

ALSO READ: టీడీపీలో అసమ్మతి సెగలు..టికెట్‌ దక్కలేదని కన్నీళ్లు

బస్సుయాత్ర షెడ్యూల్ ఇదే!

వైసీపీ బస్సుయాత్ర మరో 48 గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరగా.. 12:20కి ఇడుపులపాయ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 నుంచి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం 1:30కి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఆ తర్వాత వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా బస్సు యాత్ర ప్రొద్దుటూరు చేరుకోనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దీంతో బస్సుయాత్ర సభల్లో జగన్ ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకొని రాత్రి అక్కడే బస చేయనున్నారు.

ALSO READ: అగ్రవర్ణాలకే సీట్లు..నమ్మకస్తులకు పవన్ వెన్నుపోటు!

ప్రజా సంకల్పయాత్ర తరహాలో..

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తలపించే రీతిలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు శంఖారావం పూరించనున్నారు. అయితే ఇప్పటివరకు నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు ప్రధానంగా వివరించా.రు. కాగా, రేపటి నుంచి మరింత చేరువగా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. బస్సు యాత్ర సందర్భంగా బహుముఖ వ్యూహంతొో ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రచారంలో భాగంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి స్థానికంగా ఉన్న సమస్యలపై తగిన హామీ ఇవ్వడం ద్వారా పార్టీ వైపు మెజారిటీ ఓటర్లను ఆకర్షించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button