తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP: ఆరోగ్యశ్రీ సంగతి ఇక అంతేనా!… నిరుపేదలకు ఇక్కట్లు తప్పావా?

నిరుపేదలకు ఆరోగ్య సమస్యలు వస్తే అండగా నిలిచే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీలో నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోగ్యశ్రీకి ప్రాముఖ్యత ఇవ్వడంతో తీవ్ర ఆరోగ్యానికి గురైతే పైసా ఖర్చు లేకుండా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకునేవాళ్లు. కానీ నేటి పరిస్థితి అలా లేదు. ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

‘‘ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు! ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు! రోగులకు చికి­త్సలు అందని పరిస్థితి! ప్రజలు వైద్యం కోసం ఆయు­ష్మాన్‌ భారత్‌ కార్డును వెంటబెట్టుకుని ఆస్ప­త్రులకు వెళ్లండి. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. కేంద్ర పథకాన్ని వాడుకుంటే రాష్ట్ర ప్రభు­త్వంపైనా భారం తగ్గుతుంది..!’’ కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ రాష్ట్రంలో పేదలకు ఇస్తున్న ఉచిత సలహా ఇదీ! ఆరోగ్యశ్రీని ఒక గుదిబండలా భావిస్తూ ప్రొసీజర్లు పెంచకుండా పథకాన్ని నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు ధోరణికి పెమ్మ­సాని వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అదే మాజీ సీఎం జగన్ దురదృష్టవశాత్తూ పేదలు అనారోగ్యం పాలైతే ప్రభుత్వం అండగా నిలవాలని ఆదేశించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఎంత పెద్ద జబ్బు బారినపడినా, వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళితే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.25 లక్షలు వరకు చికిత్సలు ఉచితంగా అందుతాయని పేదలకు భరోసా కల్పించారు.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ఏపీలో కోటిన్నర కుటుంబాలకు ఆపద్భాంధవిగా నిలిచింది. 2014– 19 మధ్య టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీకి వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండగా ప్రాణం పోశారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ గుర్తుకొచ్చేలా గత ఐదేళ్లుగా ఈ పథకం అమలైంది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా 70 లక్షల మంది రూ.14,470 కోట్ల మేర ప్రయోజనం పొందారు.

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ స్థానంలో బీమా పేరిట ప్రైవేట్‌ కంపెనీని జొప్పించే యత్నంచేస్తున్నారు. ఇది కొనసాగుతుండగానే కేంద్ర పథకాన్నే నమ్ముకోవాలని చెప్పడం ద్వారా ప్రభుత్వ ఆంతర్యాన్ని పెమ్మసాని ఆవిష్కరించారు. రూ.25 లక్షల వరకూ వైద్య సేవలందించే ఆరోగ్యశ్రీని కాదని రూ.5 లక్షల మేర హెల్త్‌ కవరేజీ ఉండే ఆయుష్మాన్‌ పథకాన్ని వినియోగించుకోవాలంటూ సూచించడం దారుణమని వైద్య ఆరోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button